![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1135 లో... శైలేంద్రని రంగా తీసుకొని సరోజ ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడే దారిలో రంగాని పలకరిస్తూ వెళ్తుంటారు. వాళ్ళ మాటల్లో రంగానే అతను రిషి కాదని క్లారిటీకి వస్తాడు. బుజ్జి ఆటో తీసుకొని వస్తాడు. సర్ అందులో సరోజ ఇంటికి వెళదాం.. ఇక్కడ పక్కనే అని రంగా అనగానే అవసరం లేదని శైలేంద్ర అంటాడు. వెళదామన్నారు ఏదో అడగాలన్నారు అని రంగా అనగానే.. ఏం లేదు నాకు నువ్వు రంగావి మంచివాడివి అన్న నమ్మకం వచ్చింది. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని చెప్పండి అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వసుధార ఫోటో రంగాకి బుజ్జికి చూపించి ఈవిడ మీకు తెలుసా అని అడుగుతాడు. చెప్పొద్దంటూ బుజ్జికి రంగా సైగ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తెలియదంటారు. దాంతో శైలేంద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత మేడమ్ గారు మన ఇంట్లోనే ఉంటే తెలియదని అబద్ధం చెప్పావ్ అని బుజ్జి అడుగుతాడు. నాకు ఎందుకో అతని మీద డౌట్ వచ్చింది.. అందుకే అలా చెప్పాను.. ఒకవేళ తెలిస్తే ఎలా అని బుజ్జి అనగానే.. తెలిసినప్పుడు చూసుకుందామని రంగా అంటాడు. అన్న ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు.. మేడమ్ గారి మీద కావాలనే వాటర్ పోశారు. ఇప్పుడు మేడమ్ తెలియదంటున్నాడు.. కొంపదీసి మేడమ్ గారు అన్నట్లు అన్న రిషి సర్ ఆ అని బుజ్జి అనుకుంటాడు. ఆ తర్వాత సరోజ దగ్గరికి వసుధార వెళ్లి రిషి సర్ వచ్చారా అంటూ అడుగుతుంది. నా బావని నాకు దూరం చేసావంటు వసుధారని సరోజ తిడుతుంటే.. రంగా వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు.. అందుకు వేరే వాళ్ళని తిడితే బాగోదని అంటాడు. అబ్బాయి వాళ్ళకి సరోజ ఇష్టమని చెప్పారని సంజీవయ్యకి రంగా చెప్తాడు.
ఆ తర్వాత రంగా, వసుధారలు ఇంటికి వస్తారు. మళ్ళీ రంగాని రిషి సర్ ఏమో అని బుజ్జి మనసులో అనుకుంటాడు. నువ్వు ఏం అనుకుంటున్నావో నాకు తెలుసని బుజ్జి మనసులో అనుకున్నది వసుధార చెప్తుంది. మరొకవైపు దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. వాడు రిషి కాదు రంగా అని చెప్తాడు. అయితే వాడితో మనకి లాభం ఉంది. మినిస్టర్ ఏం అన్నాడని దేవయాని అనగానే.. రిషి అయిన వసు అయిన నిన్ను ఎండీగా చేయమని చెప్పాలని మినిస్టర్ చెప్పాడు కదా అని శైలేంద్ర, దేవయాని చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |